Sunday, August 24, 2025

తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

పశ్చిమ మధ్య, దక్షిణ మద్య బంగాళాఖాతంలో
కొనసాగుతున్న వాయుగుండం.. తుఫానుగా మారే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని, ఇది సోమవారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 26వ తేదీ నాటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి తుఫాన్ చేరుకుంటుందని పేర్కొంది. బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణ కేంద్రం వివరించింది.

సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మాల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మరో మూడు రోజులు పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News