హైదరాబాద్: తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్తను చెప్పింది. వర్షాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎండ, ఉక్కపోతతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
గురువారం రాష్ట్రంలోని (Telangana) నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగితా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కూరిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం లేదా రాత్రి తేలికపాటి వర్షం కురుస్తుందని ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఆయా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.