హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బిజెపి) పార్టీకి రాజీనామా తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికీ బిజెపి రాజీనామా చేయ్యమంటే.. సంతోషంగా చేస్తానని అన్నారు. గోషామహల్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డా అని రాజాసింగ్ చెప్పారు.
కాగా, ఇటీవల రాష్ట్ర అధ్యక్షడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావును నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను నామినేషన్ వేయకుండా కొందరు అడ్డుకున్నారని విమర్శించారు. అలాగే, కిషన్ రెడ్డిపై కూడా ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేశారు. ఇక, తాను బిజెపిలో ఉండలేనని.. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజాసింగ్ రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆమోదించారు.