హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడున్న కమిటీతో బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను అన్న రాజాసింగ్.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే తాను చేస్తానని అన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికలకు వెళ్ధాం అని సవాల్ చేశారు. బిజెపి తనకు ఎలాంటి సహకారాలు అందించలేదని.. పార్టీలో తాను ఎలాంటి పదవి ఆశించలేదని స్పష్టం చేశారు.
‘‘ఢిల్లీ పెద్దలు నాకు తరుచూ ఫోన్ చేసి మాట్లాడుతారు. నాకు కేంద్రంలోని పెద్దల ఆశీర్వాదం ఉంది. వాళ్లను కలిసి పార్టీలో జరిగిందంతా చెబుతా. నేను ఎప్పటికీ బిజెపి నేతనే.. సెక్యూలర్ వాదిని కాదు. బిఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు యుపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి తిట్టారు. నేను చేసే కామెంట్ పార్టీ గురించి కాదు.. కొందరు నేతల గురించి మాత్రమే. కార్యకర్తలు ఎవరూ ఆందోళణ చెందాల్సిన అవసరం లేదు. ఢిల్లీ పెద్దలు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని రాజాసింగ్ (Raja Singh) అన్నారు.
Also Read : ఉపఎన్నికలో గెలుపే గోపినాథ్‌కు సరైన నివాళి: కెటిఆర్