Wednesday, May 21, 2025

ఆ సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

ఏదైనా ఓ సినిమా తీశారంటే అది ప్రేక్షకులతో పాటు, సినిమా దిగ్గజాలను మెప్పిస్తే.. ఆ చిత్ర యూనిట్‌కి వచ్చే కిక్కే వేరు. తమ సినిమాకు వచ్చిన కలెక్షన్లతో పాటు.. సీనియర్ల నుంచి వచ్చిన ప్రశంసలను చూసి మురిపోతుంటారు. అలాంటిది దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) నుంచి ఓ చిన్న సినిమాకి ప్రశంసలు వచ్చాయంటే. వాళ్లు పట్టరాని సంతోషంలో తేలిపోతారు. తాజాగా ఓ చిన్న సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సినిమానే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist Family). అభిషాన్ జీవింత్ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ సినిమాపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘అద్భుతమైన సినిమా చూశాను. హృదయదాన్ని కదిలించింది. అభిషాన్ గొప్పగా రచించి డైరెక్షన్ చేశారు. ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది’’ అని రాజమౌళి (Rajamouli) పోస్ట్ చేశారు.. దానిపై టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) దర్శకుడు అభిషాన్ స్పందించారు. ‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్న ఆయన సినిమాలు ఎందో ఆశ్చర్యంగా చూసేవాడిని.. ఇప్పుడు ఆయన నా సినిమాను ప్రశంసించారు. నా పేరు పలికారు’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News