- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు, (Superstar Mahesh Babu) దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లోని సినిమాలోని కొంత భాగం చిత్రీకరణ ఈ ఏడాది మార్చిలోనే పూర్తయింది. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా సిమిలిగూడ సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత కెన్యా లో మరో షెడ్యూల్ కోసం ప్లాన్ (Plan schedule) చేశారు. అది ఈ నెలలో ఇప్పటికే ప్రారంభమైపోయి ఉండాలి. కానీ, అక్కడి పరిస్థితుల వల్ల ఈ షెడ్యూలు రద్దయింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. కెన్యాకు ప్రత్యమ్నాయంగా సౌతాఫ్రికాను ఎంచుకున్నట్లు తెలిసింది. కానీ, ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ గ్యాప్‌లో రాజమౌళి సినిమా కథను ఇంకా చెక్కుతున్నారని తెలిసింది. ఈ సినిమా 2027లో థియేటర్లలోకి వస్తుందని అంటున్నారు.
- Advertisement -