- Advertisement -
అమరావతి: ఫోన్‌లో ప్రియురాలు మాట్లాడలేదని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాజంపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెంకటపల్లి తాండాకు చెందిన జయపాల్ నాయక్(19) ఎలక్ట్రిక్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మోటర్లకు మరమ్మతులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వజ్రకరూర్ మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం కావడంతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. జయపాల్ పలుమార్లు తన ప్రియురాలుకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -