- Advertisement -
హైదరాబాద్: రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas), మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజాసాబ్’ (Raja Saab) . హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. సినిమా టీజర్ జూన్ 16వ తేదీన విడుదల చేయనున్నట్లు పేర్కొంది. అంతేకాక.. సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. రాజాసాబ్ నుంచి అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అంతేకాక.. ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీ చిత్రం చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, సంజయ్ దత్‌లు కీలక పాత్రలో కనిపించనున్నారు.
- Advertisement -