ఐపిఎల్ సీజన్ 2025లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్ విజయంతో ముగించింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్ అయుష్ మాత్రె (43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివమ్ దూబె (39) పరుగులతో జట్టును ఆదుకున్నారు. ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్, యుద్విర్ సింగ్ మూడేసి వికెట్లను పడగొట్టారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (36), వైభవ్ సూర్యవంశీ (57) జట్టుకు శుభారంభం అందించారు. సంజు శాంసన్ (41) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ధ్రువ్ జురెల్ 12 బంతుల్లోనే అజేయంగా 31 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. హెట్‌మెయిర్ 12 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.