Saturday, May 24, 2025

జితేష్ చేసిన తప్పుకి పాటిదర్‌కు భారీ జరిమానా

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 42 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఫలితంగా టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న ఆర్‌సిబి.. మూడో స్థానానికి పడింది. ఈ బాధ నుంచి తేరుకొనే లోపే ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పాటిదర్‌కు (Rajat Patidar) మరో షాక్ తగింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా కెప్టెన్‌ పాటిదర్‌కు ఐపిఎల్ అడ్వైజరీ కమిటీ.. రూ.24 లక్షల జరిమానా విధించింది.

దీంతో పాటు జట్టులో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఈ సీజన్‌లో ఆర్‌సిబి స్లో ఓవర్‌ రేటు నమోదు చేయడం ఇది రెండోసారి. అందుకే అంతటి భారీ జరిమానా పడింది. అయితే మ్యాచ్‌లో కెప్టెన్‌గా జితేష్ శర్మ వ్యవహరించినప్పటికీ.. పూర్తిస్థాయి కెప్టెన్ పాటిదరే (Rajat Patidar) కావడంతో రూల్స్ ప్రకారం అతనే జరిమానా చెల్లించాలి. దీంతో పాటు ఇదే మ్యాచ్‌లో అదే స్లో ఓవర్‌ రేటు కారణంగా సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌కి కూడా జరిమానా పడింది. ఐపిఎల్ ప్రవర్తనా నియవావళి ప్రకారం కమ్మిన్స్ తొలిసారి స్లో ఓవర్ రేటు మెయింటేన్ చేసినందుకు అతనికి రూ.12 లక్షలు జరిమానా విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News