Tuesday, August 26, 2025

క్రిష్ మార్క్ డ్రామా.. అనుష్క అద్భుత నటన

- Advertisement -
- Advertisement -

క్వీన్ అనుష్క శెట్టి నటించిన యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత రాజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “ఒక ఫిమేల్ సూపర్ స్టార్‌తో కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాలనేది మా ఐడియా. కర్తవ్యం తర్వాత ఆ స్కేల్లో మళ్ళీ సినిమా రాలేదు. ఇప్పుడున్న స్టార్స్ లో అనుష్కకి అలాంటి స్టార్‌డమ్ ఉంది. క్రిష్… అనుష్కతో ఒక ప్రాజెక్టు చేయాలనుకున్నప్పుడు ఘాటి సినిమా ప్రారంభమైంది. అరుకు, గాంజా బ్యాక్‌డ్రాప్‌లో ఒక కథ చేయాలనుకున్నాం. అయితే అది సినిమాగా చేయాలా, వెబ్ సిరిస్‌గా చేయాలా అని ఆలోచించాము.

చివరికి అనుష్కతో సబ్జెక్టుని అనుకున్న తర్వాత మూవీపై వర్క్ చేయడం మొదలుపెట్టాం. ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. దీనికి ఎలాంటి నిజ జీవిత స్ఫూర్తి లేదు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్స్‌లో ఎక్కువగా షూట్ చేశాం. ఒరిస్సాలో షూట్ చేసినప్పుడు అక్కడ స్థానిక ప్రజలు చాలా సపోర్ట్ చేశారు. విక్రమ్ ప్రభును తీసుకోవాలన్న నిర్ణయం క్రిష్‌దే. తమిళ్‌లో కూడా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ప్లస్ అవుతుంది. ఆయన అద్భుతంగా నటించారు. -టీజర్, ట్రైలర్ ఎంత బాగుంటుందో సినిమా అంతకంటే బాగుంటుంది. ఇది పూర్తిగా యాక్షన్ సినిమా. క్రిష్ మార్క్ డ్రామా ఉంటుంది. అనుష్క నటన నెక్స్ లెవెల్‌లో ఉంటుంది. -ఘాటిలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి విజువల్ ట్రీట్‌గా ఉంటుంది ఈ సినిమా. వరుణ్ తేజ్‌తో చేస్తున్న సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది. అది చాలా మంచి హారర్, కామెడీ ఎంటర్‌టైనర్‌”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News