మన తెలంగాణ /రాజేంద్రనగర్: అనుమానాస్పస్థితిలో అగ్రికల్చర్ బీఎస్సీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి విద్యార్థులను, వ్యవసాయ కళాశాల అధ్యాపకులను కలచివేసిన సంఘటన రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ బీఎస్సీ మూడవ సంవత్సరం చదువుతున్న రిత్విక్ రాజ్ ఈరోజు తోటి విద్యార్థులతో పాటు రాత్రి భోజనం చేసిన తర్వాత బయటకు రాలేదు. ప్రతిరోజు విద్యార్థులు రాత్రి భోజనం అనంతరం కొద్దిసేపు బయట వాకింగ్ చేస్తుంటారు అని తెలిసింది.
అయితే రిత్విక్ రాజ్ మాత్రం తనతోటి విద్యార్థులతో పాటు రాత్రి భోజనానంతరం బయటకు రాలేదు. అతను కొన్ని సబ్జెక్టులలో తప్పడంతో కాలేజీ నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు వెనక్కు వెళ్లాల్సి ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న రిత్విక్ రాజ్ తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్లోని గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. రుత్విక్ రాజ్ నగరంలోని నాగోల్ కు చెందిన వాడిగా సమాచారం. అగ్రి కల్చర్ బీఎస్సీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న విశ్వవిద్యాలయంలో వివిధ వివిధ కోర్సులలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు లోనట్లుగా సమాచారం. మిగతా వివరాలు, ఆత్మహత్యకుల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.