Tuesday, September 9, 2025

46 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్‌లో..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌ల భారీ మల్టీస్టారర్ రాబోతోంది. 46 ఏళ్ల తర్వాత ఈ స్టార్లు ఇద్దరూ కలిసి తెరపై కనిపించబోతున్నారు. తాజాగా సైమా అవార్డుల వేడుకలో కమల్‌హాసన్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. “మేమిద్దరం కలిసి నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. చివరికి త్వరలోనే కలిసి తెరపై కనిపించబోతున్నాం” అని కమల్‌ హాసన్ అన్నారు. అయితే ఈ సినిమా వివరాలను మాత్రం ఆయన తెలియజేయలేదు. దీంతో ఈ స్టార్ల అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. అయితే స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్‌హాసన్, రజనీకాంత్ మల్టీస్టారర్ రానున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో ఈ స్టార్లు ఇద్దరూ గ్యాంగ్‌స్టార్లుగా అలరించబోతున్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News