- Advertisement -
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, విపక్ష నేతలు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు సాగిన అఖిలపక్ష భేటీలో.. ఆపరేషన్ సిందూర్, సరిహద్దు భద్రతా వివరాలను రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామని ఖర్గే చెప్పారు.
- Advertisement -