Friday, May 9, 2025

మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు

- Advertisement -
- Advertisement -

మా ఓపిక నశిస్తే పాక్‌కు తీవ్ర పరిణామాలు
మన సేనలది గురి తప్పని పంజా నేషనల్
క్వాలిటీ క్లాంక్లేవ్‌లో రక్షణశాఖ మంత్రి
రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్
ఆగలేదు ఇప్పటికే 100మంది టెర్రరిస్టులు
హతం పాకిస్తాన్ దాడులకు పాల్పడితే
సమర్థంగా తిప్పికొడతాం అఖిలపక్షం
సమావేశంలో ప్రకటించిన మోడీ ప్రభుత్వం
త్రివిధ దళాలకు అభినందనలు

న్యూఢిల్లీ : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక సందేశం పంపారు. భారత్ పై పార్ క్షిపణి, డ్రోన్ దాడులకు యత్నించడం, వా టిని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిన తరుణంలో గురువారంనాడు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సహనాన్ని పరీక్షించొద్దని, అలుసుగా తీసుకుంటే ఆపరేషన్ సిందూర్ తరహా చర్యలకు సన్నద్ధం కావాలని హితవుపలికారు. నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ భారత్ ఎప్పుడూ సంయమనంతోనే వ్యవహరిస్తోందని, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం వెతకడాన్ని విశ్వసిస్తామన్నారు. అలాగని మా ఓపికను నశింపజేయాలనుకుంటే శత్రువు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. దేశ సాయుధ బలగాలు అత్యంత నిర్థిష్ట , ఖచ్చితమైన రీతిలో టార్గెట్‌ను అనూహ్య రీతిలో ఛేదించాని ప్రశంసించారు. ‘

మనం గురి చూసి ఎంచుకున్న లక్షాన్ని దెబ్బతీశాం. క్రమంలో మన సేనల శక్తియుక్తులు శత్రువు అంచనాలకు అందని రీతిలో ఉన్నాయి. దెబ్బకు దెబ్బతీసి మనం మన సత్తా చాటుకున్నాం’ ఆయన వ్యాఖ్యానించారు. పలు ఉగ్రవాద స్థావరాల ధ్వంసం, వంద మంది వరకూ టెర్రరిస్టుల హతం , కీలక ఆయుధ వ్యవస్థలు తుత్తునియలు ఇవన్నీ క్షణాల వ్యవధిలో చేసి , భారతీయ సైన్యం శక్తిని పొరుగుదేశానికి చవిచూపారని పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలకు పలు విధాలుగా ఊతం ఇస్తూ , విషసర్పాలకు తమ భూభాగంలో ఆశ్రయం కల్పించిన పాక్‌కు పహల్గాం దాడి తరువాత సైన్యం అత్యంత ఘాటైన రీతిలో సమాధానం ఇచ్చిందని రాజ్‌నాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News