లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా ‘రాజు గాని సవాల్‘. (Raju gani saval) ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ‘రాజు గాని సవాల్‘ సినిమా టీజర్ ను వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రిలీజ్ చేశారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ – “సోదర, సోదరి సెంటిమెంట్ సినిమాలను మన ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారు.
ఈ సినిమా కూడా అలాంటి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా”అని అన్నారు. హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ – “సోదర, సోదరి మధ్య బంధం(bond between brother sister) ఎలా ఉంటుంది, అలాగే కుటుంబంలోని బంధాలు ఎలా ఉంటాయి, స్నేహితుల మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉంటుందని ఈ సినిమాలో చూపించాం. తెలంగాణ సంస్కృతి నేపథ్యంగా సాగే క్లాసిక్ మూవీ ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, బాపిరాజు, తరుణిక, రితికా చక్రవర్తి, రవీందర్ బొమ్మకంటి, పద్మ పాల్గొన్నారు.