Wednesday, August 20, 2025

’పెద్ది’ నుంచి క్రేజీ అప్డేట్.. కొత్త లుక్‌లో చరణ్

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ’పెద్ది’లో ఇప్పటివరకూ ఎన్నడూ చూడని కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ పెద్దిలో ఇప్పటి వరకు కనిపించని లుక్‌తో మైమరపించడానికి సిద్ధమయ్యారు.

టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలీం హకీం… రామ్ చరణ్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతన్ని సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారు. రామ్ చరణ్ స్టైల్, స్వాగ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించనున్నారు. తాజాగా స్టైలిస్ట్ ఆలీం హకీం… రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ పుట్టిన రోజు మార్చి 27న విడుదల కానున్న పెద్ది, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ చిత్రం నుంచి కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ కూడా ఇటీవల అతని పుట్టినరోజున విడుదలైంది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News