‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ (Ram Charan) ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో అభిమానుల్ని నిరాశ పరిచారు. అయితే ఆయన ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ చరణ్ అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాతో మళ్లీ రామ్ చరణ్ ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో (Trivikarm) రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.
‘పెద్ది’ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా స్క్రీప్ట్ విషయంలో ఆలస్యమవుతోంది. దీంతో ఈ గ్యాప్‌లో రామ్‌చరణ్ మరో స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఆయన ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikarm).
త్రివిక్రమ్ ప్రస్తుతం హీరో వెంకటేష్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌తో ఆయన సినిమా చేయనున్నారని టాలీవుడ్‌లో టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమయ్యాయని, చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌కి రామ్ చరణ్ నటన తోడైతే.. సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం పక్కా అని అభిమానులు ఆశపడుతున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.