Wednesday, August 13, 2025

ఒంగోలు పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరైన దర్శకుడు రాంగోపాల్‌వర్మ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. మంగళ వారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్‌బాబు నోటీసులు జారీ చేశారు. గత వైసిపి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోల మార్ఫింగ్ కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ’వ్యూహం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ కించపరిచినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై గతేడాది నవంబర్ 10వ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న వర్మ విచారణకు వచ్చారు. మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేయ డంతో మంగళవారం మళ్లీ ఆయన విచారణకి హాజరయ్యారు. ఆర్‌జీవీని ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్‌బాబు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News