Sunday, August 17, 2025

కింగ్‌కే ఆ క్రెడిట్..

- Advertisement -
- Advertisement -

మన తెలుగు సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఒక పాత్ బ్రేకింగ్ ఇండస్ట్రీ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్ లో చేసిన శివ చిత్రమని చెప్పొచ్చు. అప్పుటి వరకు వెళ్తున్న ఓ ఫార్మాట్‌ని బ్రేక్ చేసి ఆడియెన్స్‌కి కొత్త ట్రీట్ ఇచ్చిన ఈ సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ కొన్ని ఆసక్తికరమైన జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. తనకి తన తండ్రి జన్మనిస్తే ఈ సినిమాతో కింగ్ నాగార్జున నన్ను నమ్మి అవకాశం ఇచ్చి మరో జన్మ ఇచ్చారు అని వర్మ తెలిపారు.

అంతే కాకుండా ఆ సినిమా సమయంలో జరుగుతున్న ఓ సమ్మె కారణంగా ఆడియో పరంగా ఇబ్బంది అవుతుంది, ముంబయ్ వెళ్లి పనులు చేయించుకోవాలి అన్నప్పుడు నాగ్… తన రెమ్యునరేషన్ అయినా తగ్గించుకోండి కానీ పని మాత్రం ఆగకూడదు అని చెప్పినట్టు ఆర్జీవీ తెలిపారు. అప్పటికి తన విజన్‌ని అంతలా నాగార్జున నమ్మారు కాబట్టి ఈ సినిమా విజయం సాధ్యమైందని, కింగ్‌కే ఆ క్రెడిట్‌ని అందించారు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన శివ సినిమాను రీ రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో, 4కె విజువల్స్‌తో మళ్లీ విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News