Wednesday, August 13, 2025

‘జగ్రీస్’ టీజర్ వచ్చేసింది.. సరదాగా కాసేపు నవ్వుకోండి..

- Advertisement -
- Advertisement -

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు రామ్ నితిన్. అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రీస్’ (Jigris Movie). ఈ సినిమాలో కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా కూడా ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఫ్రెండ్‌షిప్, అడ్వెంచర్, కామెడి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. ‘కొంత మంది ఉంటారు సుద్దపూసలు, ఫస్ట్ వద్దే వద్దు అంటూ షో చేస్తరు.. తర్వాత కూర్చున్నాక నాకంటే ఎక్కువ తాగుతరు’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. నలుగురు స్నేహితలు జీవితాల్లో జరిగే ఘటనలతో సాగే ఈ సినిమా (Jigris Movie) టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఇక ఈ సినిమాకు హరీష్ రెడ్డి ఉప్పల దర్శకత్వం వహించగా.. కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ టీజర్ చూసి మీరు సరదాగా నవ్వుకోండి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News