Sunday, September 14, 2025

అయోధ్యలో జనవరిలో ప్రారంభానికి సిద్ధమౌతున్న రామాలయం

- Advertisement -
- Advertisement -

లక్నో : అయోధ్యలో రామాలయం జనవరిలో ప్రారంభానికి సిద్ధమౌతోంది. అయితే రవాణా సౌకర్యాలు, సదుపాయాలకు సంబంధించి విమానాశ్రయం, రైల్వేస్టేషన్, తదితర పనులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోంది. రామ్‌పథ్ పనుల్లో సహదత్‌గంజ్ నుంచి నయాఘాట్ వరకు 13 కిమీ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. రామ్ జానకీ పథ్, భక్తిపథ్ నిర్మాణాలు సిద్ధమయ్యాయి.

రామజన్మ భూమి పథ్ రోడ్ 30 మీటర్ల వెడల్పు, భక్తిపథ్ రోడ్ 14 మీటర్ల వెడల్పులో నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివిధ పనులను రోజూ సమీక్షిస్తున్నారు. అయోధ్య అభివృద్ధి కోసం ప్రభుత్వానికి మద్దతుగా షాపుల వారు తమ భూములను ఎలాంటి ప్రతిఘటన లేకుండా అప్పగించారని ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఈ నిర్మాణాల వల్ల షాపులను కోల్పోయారో వారికి కొత్తగా నిర్మించిన కాంప్లెక్సుల్లో షాపులు కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News