హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి బిల్లు తెచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) అన్నారు. అసాధ్యమైన పనిని కేంద్రం పైకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. బిజెపి, కేంద్రం ప్రభుత్వంపై (Central Govt) నిందలు వేస్తే ఊరుకోము అని హెచ్చరించారు. న్యాయపరమైన సలహాదారులు లేరా తమకు? అని నిలదీశారు. ముస్లింకు 10 శాతం రిజర్వేషన్ తీసేసి బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, 42 శాతం బిసి రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ లోకి తీసుకురాలేము అని పేర్కొన్నారు. తొమ్మిదో షెడ్యూల్ లోకి తీసుకురావడానికి సుప్ర్రీం కోర్టు అనుమతించదని చెప్పారు. తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలని అసెంబ్లీ లో ఎందుకు చెప్పలేదు? అని రామచందర్ రావు ప్రశ్నించారు.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారు: రామచందర్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -