- Advertisement -
హైదరాబాద్: గవర్నర్ దత్తాత్రేయ మీద రేవంత్ రెడ్డికి ప్రేమ ఉండడం సంతోషం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై తనకూ ప్రేమ ఉంది అని అన్నారు. రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ను సిఎంగా తొలగించి పొన్నం లేదా మహేష్ గౌడ్ ను సిఎం (Ponnam, Mahesh Goud CM) చేయాలి అని కోరారు. నరేంద్ర మోడీ బిసి కాదని రేవంత్ రెడ్డి అవమానించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్వర్టడ్ అని రేవంత్ రెడ్డి కొత్త పదం సృష్టించారని రామచందర్ రావు ఎద్దేవ చేశారు.
- Advertisement -