Tuesday, July 8, 2025

బండ్లగూడలో ప్రియురాలిని చంపి?… ప్రియుడు గొంతుకోసుకొని

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ప్రియురాలి మృతదేహం వద్ద గొంతుకోసుకొని ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయనగరం జిల్లాకు చెందిన శ్రీనివాస్, ఈశ్వరమ్మ అనే దంపతులు తన కూతురు రమ్య(23)తో బండ్లగూడలోని బాలాజీనగర్‌లో ఉంటున్నారు. మెదక్ జిల్లాకు చెందిన ప్రవీన్ కుమార్ అల్వీన్ కాలనీలో ట్యూషన్లు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం రమ్యతో ప్రవీణ్ కుమార్‌కు పరిచయం ఏర్పడింది.

పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రమ్య తన ప్రేమికుడిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. సోమవారం మధ్యాహ్నం తల్లి ఈశ్వరమ్మ ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి గడియ పెట్టడంతో కిటికీలో నుంచి పరిశీలించింది. రమ్య గొంతు కోసి అచేతనంగా పడి ఉంది. ప్రవీణ్ కుమార్ బెడ్ మెడ మీద గాయంతో కనిపించాడు. వెంటనే ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

రమ్య మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ప్రియుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రియురాలి చంపి గొంతు కోసి చంపి అనంతరం ప్రవీణ్ గొంతు కోసుకొని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News