- Advertisement -
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఇఒ గా ఎల్.రమాదేవిని నియమిస్తూ గురువారం సాయం త్రం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తాయని ఉత్త ర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం భద్రాచలం రామాలయం ఈ.వోగా పని చేస్తున్న రమాదేవి 2022 జనవరి 17 నుండి కొద్దిరోజుల పాటు వేములవాడ ఆలయ ఈ.వోగా పని చేసి పాలనలో తనదైన ముద్ర వేసింది. ఈ క్రమంలో మరోసారి తిరిగి రాజన్న ఆలయ ఇఒగా వస్తుండటంతో రాజన్న భక్తులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో పాలన సక్రమంగా సాగడమే కాకుండా త్వరలో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులు సైతం శరవేగంగా కొనసాగుతాయన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -