Saturday, August 2, 2025

మూడో వ్యక్తి ప్రాణం తీసిన వంద రూపాయలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వంద రూపాయల వివాదం మూడో వ్యక్తి ప్రాణం తీసింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోదావరిఖనిలోని ఎన్‌టిపిసి పర్మినెంట్ టౌన్‌షిప్‌లో వలస కూలీలు ఓ షెడ్డు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. వలస కూలీలు నిర్మాణ పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒక వ్యక్తి మరో వ్యక్తి మూడు వందల రూపాయలు ఇచ్చాడు. అప్పు ఇచ్చిను వ్యక్తి తిరిగి 200 రూపాయలు ఇచ్చాడు. ఇంకా వంద రూపాయల ఇద్దరు మధ్య గొడవ జరిగింది.

ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో వినోద్ బుద్ధాజీ సొంకార్(44) వాళ్లకు నచ్చ జెప్పి సర్దిచెప్పాడు. దీంతో వినోద్‌పై ఇద్దరులో మనోజ్ అనే వ్యక్తి కోపం పెంచుకున్నాడు. మనోజ్ అర్థరాత్రి ఐరన్ రాడ్డు తీసుకొని వినోద్ తలపై బాదాడు. తెల్లవారుజామున వినోద్ రక్తపు మడుగులో కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News