- Advertisement -
అమరావతి: కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే నాగమల్లేశ్వరరావుపై దాడి చేశారని, నాగమల్లేశ్వరరావు పరిస్థితి సీరియస్ గా ఉందని వైసిపి రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Ramakrishna Reddy) తెలిపారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఎపిలో రెడ్ బుక్ రాజ్యాంగం (Red Book Constitution AP) నడుస్తోందని విమర్శించారు. దాడులపై వైఎస్ఆర్ సిపి నేతలు ఫిర్యాదు చేస్తే ఒక్క కేసు నమోదు కాలేదని మండిపడ్డారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తే చర్యలు తీసుకోలేదని, రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
- Advertisement -