Sunday, August 31, 2025

‘రామాయణ’ ఫస్ట్ పార్ట్ ముగింపు అక్కడే.. ఆ స్టార్ హీరో వాయిస్‌తో

- Advertisement -
- Advertisement -

భారత సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. అందరికీ తెలిసిన ఇతిహాసమే అయినా.. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది. మొదటి భాగం (Ramayana Part-1).. వచ్చే ఏడాది దీపావళి కానుకగా రానుంది. అయితే ఈ సినిమాను పరిచయం చేస్తూ.. కొద్ది రోజుల క్రితం చిత్ర యూనిట్ ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. దీంతో సినిమాపై అంచనాలు మరోస్థాయికి వెళ్లిపోయాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త తెలిసింది. రాముడికి జటాయువు సీత జాడ గురించి ఇచ్చే సందేశంతో రామాయణ తొలి పార్ట్ (Ramayana Part-1) ముగిస్తారట. ‘రామాయణ మొదటి భాగం జటాయువు మరణంతో ముగుస్తుంది. జటాయువుకు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తారు. ఈ సన్నివేశంతో సీతాదేవిని ఎవరు అపహరించారో రాముడికి తెలుస్తుంది. అసలు యుద్ధం పార్ట్-2లో ఉంటుంది’ అని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. రావణాసురిడి పాత్రలో కన్నడ స్టార్ యశ్ కనిపించనున్నారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్ర భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం 2026 దీపావళికి.. రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Also Read : ‘ఘాటి’ సెన్సార్ పూర్తి.. సినిమా నిడివి ఎంతంటే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News