Friday, August 22, 2025

జివో 49 రద్దు చేసి…పోడు రైతులను ఆదుకోండి: రాంచందర్ రావు

- Advertisement -
- Advertisement -

పోడు రైతులను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా వెంటనే జివో నెం. 49ను రద్దు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. జివో 49 ద్వారా కొమురం భీం అసిఫాబాద్ జిల్లాను టైగల్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించడం, దీంతో 339 గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడి అభివృద్ధి పనులు నిలిచి పోతాయని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని కూడా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారంటే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉన్నదో అర్థం అవుతున్నదని ఆయన తెలిపారు. ఇప్పటికే కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో దాదాపు వంద గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది మే 30న జారీ చేయడంలో ఆదివాసి సంఘాలు, ప్రతిపక్షాలు కలెక్టరేట్‌ను ముట్టడించినా ప్రభుత్వం స్పందించకుండా మొండిగా వ్యవహారిస్తున్నదని ఆయన తెలిపారు.

పోడు భూముల సాగు కోసం సహకరిస్తాం అని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నదని ఆయన గుర్తు చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల విషయంలో రైతులెవరినీ ఇబ్బంది పెట్టబఓమని హామీ ఇచ్చి ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆయన విమర్శించారు. పోడు భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని రైతులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం ఆ జివోను రద్దు చేసి, పోడు రైతులను ఆదుకోవాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News