హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బిజెపి కార్పొరేటర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్‌రెడ్డి మండ్డిపడ్డారు. పెద్దమ్మగుడి దగ్గర హిందూసంఘాల కుంకుమార్చనకు పిలుపునివ్వడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోందని దుయ్యబట్టారు. కుంకుమార్చనకు వస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల పెద్దమ్మగుడి దగ్గర హైడ్రా అధికారులు కట్టడాలను కూల్చివేశారని ఆరోపణలు చేశారు. అధికారుల తీరుపై తాము, హిందూ సంఘాలతో కలిసి ఆందోళనలు చేపట్టామన్నారు. రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని దుయ్యబట్టారు. ప్రతిపక్షనేతలను నిర్బంధించడం మానుకోవాలని ప్రభుత్వాన్ని మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. పెద్దమ్మ గుడి దగ్గర నాలాను అక్రమించిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేసిన విషయం తెలిసిందే. నాలాపై నిర్మించిన షెడ్లను కూడా తొలగించారు. 500 గజాల స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన విషయం విధితమే.
రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్ ఖండిస్తున్నాం: బిజెపి
- Advertisement -
- Advertisement -
- Advertisement -