బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు దగ్గుబాటి రానా సోమవారం ఇడి విచారణకు హాజరైయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు రానాను సుమారు నాలుగు గంటలపాటు విచారించారు. విచారణ అనంతరం రానా మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో రానా బ్యాంకు లావాదేవాలపై అధిరాకారులు విచిరించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు తీసుకున్న పారితోషకం ఇతర వివరాలపై ఇడి అధికారులు రానాను ప్రశ్నించినట్లు తెలిసింది. రానా తన బ్యాంకు సంబంధించిన లావాదేవీల వివరాలు అధికారులకు అందించారు. బెట్టింగ్ యాప్ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఇడి వరుసగా నిందితులను విచారిస్తోంది. ఇప్పటికే నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకోండ, తాజాగా రానాను విచారించగా, రేపు నటి మంచులక్ష్మిని సైతం ఇడి అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే విచారణకు రావాలని మంచు లక్ష్మికి అధికారులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌పై నటులు, టివీ హోస్ట్‌లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు 29 మందిపై రాష్ట్రంలోని పలు చోట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల ఆధారంగా ఇడి రంగంలోకి దిగింది.
ఇడి విచారణకు హాజరైన నటుడు రానా
- Advertisement -
- Advertisement -
- Advertisement -