హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రేపు (జూలై 23న) విచారణకు రావాలని నటుడు రానా దగ్గుబాటికి (Rana Daggubati) ఇడి నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు రానా కాస్త సమయం కోరాడు. రేపు షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున విచారణకు హాజరుకాలేనని రానా తెలిపాడు. విచారణకు వచ్చేందుకు తనకు సమయం ఇవ్వాలని రానా విజ్ఞప్తి చేశాడు.
కాగా, బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇడి రానాతో (Rana Daggubati) పాటు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలను విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ప్రకాశ్ రాజ్ జూలై 30న, విజయ్ ఆగస్టు 6న, లక్ష్మి ఆగస్టు 13న విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో ఇడి ఇప్పటివరకూ 25 మందిని విచారించింది. ఈ యాప్స్ ప్రమోషన్ కోసం భారీగా డబ్బు తీసుకున్నారని సెలబ్రిటీలపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇడి ఆరా తీస్తోంది.