బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ చిత్రం ‘రామాయణ’ (Ramayana). నితీశ్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా సాయి పల్లవి నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా కోసం వీరిద్దరి పారితోషికానికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. ‘రామయణ’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒక భాగానికి రూ.75 కోట్ల చొప్పున రణ్‌బీర్ రూ.150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఇక సాయిపల్లవి కూడా ఈ సినిమాకి భారీ రెమ్యూనరేషన్ అందుకుంటుందట. ఆమె రూ.15 కోట్ల ఈ సినిమాకి పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రూ.1600 కోట్లతో భారీ బడ్జెట్‌తో రామయణ (Ramayana) సినిమా రూపొందుతోంది. నమిత్ మల్హోత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, కన్నడ రాక్‌స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, యశ్ ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం 2026, దీపావళికి, రెండో భాగం 2027, దీపావళికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.