- Advertisement -
హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై లీగల్ సమస్యలు వస్తాయని ముందే చెప్పామని బిజెపి అధ్యక్షుడు రాంచందర్ తెలిపారు. బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయ నిపుణులను ముందు సంప్రదించారా? అని రిజర్వేషన్ల విషయంలో బిజెపి ఎక్కడ అడ్డుపడింది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేయలేక తమపై నెపం వేయవద్దని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బిజెపికి అధికారం ఇస్తే బిసిల 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ కు చిత్త శుద్ధి లేకుండా తమపై నిందలు వేస్తున్నారని రాంచందర్ ధ్వజమెత్తారు.
Also Read : వ్యవసాయ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను వెన్నెముకగా భావిస్తుంది: భట్టి
- Advertisement -