- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం భారీగా గంజాయిని పట్టించింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాట సింగారం వద్ద కారు డివైడర్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన కారులో 16 కిలోల గంజాయి దొరికింది. మహబూబాబాద్‌కు చెందిన భూక్య నాయక్ ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుడంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి సెల్‌ఫోన్, 16 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -