- Advertisement -
మన తెలంగాణ/రంగారెడ్డి: జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా చంద్రారెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ద పూర్ణిమ ప్రాజెక్ట్ ఓఎస్‌డిగా పనిచేసిన ఆయనను ప్రభుత్వం జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా బదిలీ చేసినట్లు తెలిసింది. గతంలో ఇక్కడ అడిషనల్ కలెక్టర్‌గా పనిచేసిన భూపాల్‌రెడ్డి ఏసిబికి పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఖాళీగా ఉన్న అడిషనల్ కలెక్టర్ స్థానంలో చంద్రారెడ్డిని ప్రభుత్వం నియమిస్తోంది. త్వరలో ఆయన పదవీ భాద్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
- Advertisement -