చేవెళ్ల: ఎంత కట్టడి చేయాలని చూసిన హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వాడకం జరుగుతోంది. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి డ్రగ్స్ వినియోగదారుల ఆటకట్టిస్తున్నారు. కానీ ఏదో మూల వాటి చెలామణి జరుగుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో (Rangareddy Chevella) ఐటీ ఉద్యోగులు రెచ్చిపోయారు. సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యంతో బర్త్‌డే పార్టీ జరుపుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో రెండు లక్షల రూపాయిల విలువైన డ్రగ్స్‌తో పాటు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. ఆరుగురు ఐటి ఉద్యోగులకు పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ బర్త్‌డే సందర్భంగా ఫామ్‌హౌస్‌ని బుక్ చేసుకున్నట్లు తెలిసింది. ఫామ్‌హౌస్ నిర్వహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌తో బర్త్‌డే పార్టీ.. అరుగురు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -