Wednesday, July 23, 2025

మైలార్ దేవ్ పల్లిలో లారీని ఢీకొట్టిన కారు

- Advertisement -
- Advertisement -

మైలార్ దేవ్ పల్లి: రంగారెడ్డి జిల్లా  మైలార్ దేవ్ పల్లిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బాబూల్ రెడ్డి నగర్ లో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. సగం వరకు కారు దూసుకెళ్లింది. కారులో ఉన్నవారు స్వల్పంగా గాయపడడంతో  పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి‌ తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో లారీ నుంచి కారును వేరు చేశారు. రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News