బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) చిత్రాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన నటన, బాడీ లాంగ్వేజ్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటిస్తున్న తాజాగా చిత్రం ‘దురంధర్’. ‘ఉరి-ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆదివారం రణ్‌వీర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్ వెండితెరకు పరిచయం అవుతోంది. సారా అర్జున్ అంటే విక్రమ్ నటించిన ‘నాన్న’ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన అమ్మాయి. ఆమె ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె. సారా.. అప్పుడే హీరోయిన్‌గా మారడం.. అది 40 ఏళ్ల రణ్‌బిర్ సింగ్ (Ranveer Singh) పక్కన నటించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సినిమాలో మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జ్యోతి దేశ్‌పాండే, లోకేశ్ ధార్ ఈ సినిమాని నిర్మించారు. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.