Sunday, August 31, 2025

సెప్టెంబర్ 7న అరుదైన బ్లడ్ మూన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఖగోళ ప్రియులకు గుడ్‌న్యూస్. వచ్చే నెల సెప్టెంబర్ 7న అరుదైన సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనున్నది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోనున్నాడు. దీన్ని బ్లడ్‌మూన్‌గా పిలుస్తారు. భారత్‌తో సహా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనున్నది. అమెరికా ఖండంలో మాత్రం గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ చంద్రగ్రహణం ఈ ఏడాది రెండోది కావడం విశేషం. తొలి చంద్ర గ్రహణం మార్చి 14న ఏర్పడగా, అది భారత్‌లో కనిపించలేదు. సెప్టెంబర్ 7న జరగబోయే గ్రహణం దేశంలో చాలా చోట్ల స్పష్టంగా కనిపించనున్నది. దాంతో సూతకాలం వర్తిస్తుందని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు.

సెప్టెంబర్ 7న పెనుంబ్రల్ గ్రహణం రాత్రి 8.58 గంటలకు ప్రారంభమవుతుంది. పాక్షిక చంద్రగ్రహణం రాత్రి 9.57 గంటలకు మొదలవుతుంది. సంపూర్ణ గ్రహణం రాత్రి 11.30 గంటలకు మొదలవుతుంది. గరిష్ఠ గ్రహణం అర్ధరాత్రి 12.11 గంటలకు దర్శనమిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 12.52 గంటలకు పూర్తవుతుంది. పాక్షిక గ్రహణం తెల్లవారు జామున 1.56 గంటలకు, పెనుంబ్రల్ గ్రహణం ఉదయం 2.55 గంటలకు ముగుస్తాయి. మొత్తం గ్రహణ దశలు కలిపితే 5.27 గంటలు ఉంటుంది. సంపూర్ణగ్రహణం 82 నిమిషాలు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News