ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఐపిఎల్ చూసేవాళ్లలో కొందరికి మ్యాక్సీ ఫేవరేట్ క్రికెటర్. ఆస్ట్రేలియాకు కూడా మ్యాక్సీ ఎన్నో విజయాలను అంీదిండు. ఇప్పుడు ఆసీస్ జట్టు సౌతాఫ్రికాతో టి-20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో మ్యాక్సీ మరో నాలుగు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 2500 పరుగులు, 50 వికెట్లు తీసిన ఘనతను మ్యాక్స్‌వెల్ పొందుతాడు.
ఈ ఫీట్‌ని ఇప్పటివరకూ ముగ్గురు క్రికెటర్లు సాధించారు. బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్, పాకిస్థాన్ మాజీ ఆటగాడు మొహమ్మద్ హఫీజ్, మలేసియా ఆల్ రౌండర్ విరన్‌దీప్ ఈ జాబితాలో ముందున్నారు. షకీబ్ 129 మ్యాచుల్లో 2,551 పరుగులు, 149 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా.. హఫీజ్ 119 మ్యాచుల్లో 2,514 పరుగులు, 61 వికెట్లు పడగొట్టాడు. విరన్‌దీప్ 102 మ్యాచుల్లో 3,013 పరుగుల చేసి 97 వికెట్లు తీశాడు. మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ఇప్పటిదాకా 121 మ్యాచ్‌లు ఆడి 2754 పరుగులు చేసి, 46 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో మ్యాక్స్‌వెల్ ఈ రికార్డును అందుకుంటాడో.. లేదో చూడాలి మరి?