ఆసియాకప్లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘానిస్థాన్ జట్టు స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. అయితే తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదని.. అందుకే ఓటమిని ఎదురుకోవాల్సి వచ్చిందని ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) అన్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. కానీ, ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అఫ్ఘాన్ జట్టు విఫలమైంది. 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో బంగ్లా ఈ మ్యాచ్లో ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో సూపర్-4 ఆశలను అఫ్ఘాన్ జట్టు క్లిష్టతరం చేసుకుంది. శ్రీలంకతో జరిగే తదుపరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.
అయితే ఈ మ్యాచ్లో తమ స్థాయికి తగిన ఆట ఆడలేదని మ్యాచ్ అనంతరం కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) తెలిపాడు. ‘‘ఆఖరి వరకూ పోరాడినా.. అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాం. 18 బంతుల్లో 30 పరుగులు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, మా స్థాయికి తగినట్లు రాణించలేకపోయాం. ఒత్తిడి గురయ్యాము. ప్రత్యర్థిని 160 పరుగుల లోపు కట్టడి చేశాము. కానీ, బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాము. కొన్ని చెత్త, బాధ్యతారహిత షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాము. ఆసియాకప్ టోర్నీలో ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదే. శ్రీలంకతో మ్యాచ్కు అన్ని విధాలుగా సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుతం మా ముందు ఉన్న పెద్ద సవాలు ఇదే’’ అని రషీద్ అన్నాడు.
Also Read : ఆ నిర్ణయం సరికాదు.. ‘మా ఐన్స్టీన్’ అంటూ అక్తర్ అసహనం..