- Advertisement -
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మందన ఏప్రిల్ 16న జరిగిన ఉగ్రదాడి గురించి స్పందించారు.ఉగ్రవాదం నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు చేసే పోరాటం యుద్ధం కాదని పోరాటానికి మద్దతు ఇచ్చే వారిని యుద్ధాన్ని కాంక్షించే వారి గా పేర్కొనొద్దని రష్మిక మందన తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో ఆమె చేసిన పోస్టు వైరల్ గా మారింది. కుట్రపూరితంగా జరిగిన ఉగ్ర దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని దానికి ప్రతికారం తీర్చుకోవడం బాధ్యత అవుతుంది తప్ప అవకాశం కాదనీ శాంతిని కోరుకోవడం అంటే అర్థం జరిగిన హాని మౌనంగా అంగీకరించడం కాదని అన్నారు.
- Advertisement -