Tuesday, July 1, 2025

సినిమా వదులుకుంటా కానీ.. ఆ పని మాత్రం చేయను: రష్మిక

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ ఎవరంటే అందరూ రష్మిక (Rashmika Mandanna) పేరే చెబుతారు. సౌత్‌లోనే కాదు.. అటు బాలీవుడ్‌లో కూడా సినిమాలతో ఆమె హవా కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ‘కుబేర’ సినిమాతో మరో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంది రష్మిక. తాజాగా ఆమె ‘వి ద ఉమెన్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన కెరీర్‌కు సంబంధించిన అనేక అంశాలను ఆమె పంచుకున్నారు. అయితే తాను స్మోకింగ్‌ను ఏ మాత్రం ప్రోత్సహించను అని చెప్పిన రష్మిక.. ప్రాజెక్టుల ఎంపిక విషయంలోనూ తనకు కొన్ని రూల్స్‌ ఉంటాయని వెల్లడించింది.

‘‘వ్యక్తిగతంగా నేను స్మోకింగ్‌ని ప్రోత్సహించను. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా ఇష్టపడను. అయితే ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఒకవేళ పాత్ర కోసం అలాంటి సన్నివేశాల్లో నటించాలని ఎవరైనా కోరితే.. ఆ సినిమా వదులుకోవడానికి కూడా తాను వెనకాడను’’ అని రష్మిక (Rashmika Mandanna) తెలిపింది.

రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న ‘మైసా’ అనే చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రష్మిక ఇంతకు ముందెన్నడూ చూడిన రఫ్ లుక్‌లో కనిపించింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ఆమె ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘థామా’, ‘కాక్‌టైల్-2’ సినిమాల్లో నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News