Tuesday, September 2, 2025

మంగళవారం రాశి ఫలాలు (02-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

వృషభం – జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది.

మిథునం – ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

కర్కాటకం – వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.

సింహం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. అనుకొని అవకాశాలు లభిస్తాయి.

కన్య – పట్టుదలతో ప్రతి పనిని సానుకూలపరుచుకుంటారు. మిమ్మల్ని అభిమానించే వారికి గట్టి మేలు చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు.

Also Read : లవర్ గిఫ్ట్ కోసం జైలుకెళ్లాడు

తుల – అత్యంత ఆశ్చర్యకరంగా ఎక్కువగా శ్రమించకుండానే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది.

వృశ్చికం – ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు.

ధనుస్సు – గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

మకరం – బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. లీజులు కాంట్రాక్టులు లాభిస్తాయి. ఇంటా బయట మీకు అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం – జీవిత భాగస్వామి నుండి స్వల్ప ధన లాభం పొందుతారు. రాజకీయ రంగాల వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది.

మీనం – దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించు కుంటారు. సంతానం నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News