Saturday, August 23, 2025

శనివారం రాశి ఫలాలు (23-08-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం. కృషి ఫలిస్తుంది. వాహనాలు నడిపే విషయంలో కొంత మెలకువ అవసరం. సంతానం నుండి శుభవార్తలు వింటారు.

వృషభం – కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అనవసరపు విషయాలలో జోక్యం వద్దు. వాహనయోగం. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆనందకరమైన వాతావరణం ఏర్పరుచుకుంటారు.

మిథునం – గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అనుకోని వ్యక్తులు మాట సాయం చేస్తారు. మానసిక ఆనందం కలుగును.

కర్కాటకం – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందందా గడుపుతారు. నూతన వస్తు కొనుగోలు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

సింహం – వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. పనులలో విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

కన్య – సన్నిహితుల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును

తుల – మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వాహనాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన ఒప్పందాలు కుదురుతాయి.

వృశ్చికం – ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు వుంటాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం.

ధనుస్సు –  నూతన ఉత్తేజం కలిగి వుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మకరం – ఋణాలు కొంత వరకు తీరుస్తారు. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. వస్తు లాభం పొందుతారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

కుంభం – ఆరోగ్యం విషయాలలో నిర్లక్ష్యం తగదు. విందు. వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

మీనం – మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

Rasi phalalu cheppandi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News