Friday, June 6, 2025

శుక్రవారం రాశి ఫలాలు (06-06-2025)

- Advertisement -
- Advertisement -

మేషం: ముందు జాగ్రత్త లేకపోవడం వలన ఒక సందర్భంలో చిన్నపాటి ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కొనవలసి వస్తుంది. మీ నైపుణ్యతకు సామర్థ్యానికి తగినటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు.

వ్యషభం: స్నేహ సంబంధమైన బంధాలను మరింతగా వృద్ధి చేసుకునే విధంగా అడుగులను ముందుకు వేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. మీపై ఉన్న గుడ్ విల్ ను నిలుపుకోగలుగుతారు.

మిథునం: బంధువర్గం వారికి ఆర్థికంగా సహాయం చేయవలసిన స్థితి మీకు తప్పకపోవచ్చు. కొనుగోలు అమ్మకలకు సంబంధించిన విషయాలలో అజాగ్రత్త తగదు. రుణాలు తీరుస్తారు.

కర్కాటకం: భాగస్వాముల నుండి రావలసిన ముఖ్యమైన పత్రాలు సకాలంలో అందటం వలన లాభపడగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల పైననే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు.

సింహం: పొదుపును పాటించడానికి వ్యూహరచన చేస్తారు. కుటుంబ పరమైన చికాకులు వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. తద్వారా లాభపడతారు.

కన్య:  ముఖ్య విషయాలలో స్వయం నిర్ణయాలకు ప్రాముఖ్యతను ఇస్తారు. వ్యాపారంలో పోటీని ఎక్కువగా ఎదుర్కొనవలసి వస్తుంది. సమాజంలో మీ స్థాయి గౌరవం పెరుగుతాయి.

తుల: మీ విజయమే మీ శత్రువులకు సమాధానం చెబుతుందని ఆత్మస్థైర్యంతో ముందు అడుగు వేస్తారు. ఆరోగ్యపరంగా స్వల్పమైన ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి.

వ్యశ్చికం: మీ ఆలోచనలు మెరుగ్గా చురుగ్గా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం వలన అవసరాలకు సరిపడా ధనాన్ని సంపాదించుకోవడానికి గాను ప్రాముఖ్యత ఇచ్చి ఆ విషయం పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు.

ధనుస్సు: సంతాన విద్యా విషయమై దీర్ఘంగా ఆలోచిస్తారు. రుణాలు తీర్చి వేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల గ్రహస్థితి కనబడుతోంది. కుటుంబ పురోభివృద్ధిని సాధించడానికి విశేషంగా శ్రమిస్తారు.

మకరం: ఆర్థిక సర్దుబాటులను నేర్పుగా చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎంతో సాధించాలనుకున్న మీ తపన పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతమేరకు సఫలీకృతం అవుతుంది.

కుంభం: మీ ప్రత్యర్ధులు ఎంత బలవంతులైన దైవానుగ్రహం వలన మిమ్మల్ని ఏమీ చేయలేక పోతారు. వివాదాలు, కోర్టు కేసుల నుండి బయటపడతారు. ఆర్థిక మార్గాలు కలిసి వస్తాయి.

మీనం: చాలాకాలంగా అపరిస్కృతంగా ఉన్న సమస్యలు సానుకూల పడతాయి. గృహోపకరమైన పరికరములు ఇవ్వవలసిన రుణములు రావలసిన బాకీలు మొదలైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News