మేషం – నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను అనుకున్న విధంగా ప్రారంభించగలుగుతారు. కాంట్రాక్టు వర్క్స్ , ఆర్డర్స్ లాభదాయకంగా ఉంటాయి.
వృషభం – వ్యక్తిగత అవసరాలకు, సదుపాయాలకు, కొత్త పెట్టుబడులకు, విహారయాత్రలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు.
మిథునం – వృత్తి ఉద్యోగాలలో తలమునకలై ఉండటం వలన ఇతరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేరు. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి గాను ఏర్పడిన అవాంతరాలు తొలగిపోతాయి.
కర్కాటకం – శుభవార్తలకు సంబంధించిన తీపి కబురు ఆనందం కలిగిస్తుంది. సంతానం పైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. స్వల్ప ధన లాభం గోచరిస్తుంది.
సింహం – ముఖ్యమైన వ్యక్తులను కలుసుకొని కీలకమైన వాగ్దానాలు తీసుకుంటారు. విదేశాలలోని మీ స్నేహితులు లేక ఆప్తులు మాట సహాయమే తప్ప ఆర్థిక సహాయాన్ని అందించరు.
కన్య – స్థిరాస్తి వివాదాల పరిష్కారానికి గాను మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. ఆర్థిక విషయాలను దృష్టిలో ఉంచుకొని అందరూ మీతో స్నేహాన్ని నటిస్తున్నారని భావిస్తారు.
తుల – ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రమోషన్స్ పెండింగ్ వ్యవహారాలు పరిష్కార దశకు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృశ్చికం – వినోద కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది. అన్యాయమైన ప్రవర్తన కలిగిన వారి వలన స్వల్పమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ధనుస్సు – స్నేహితులకు మీ పరిధిలను మించి సహాయ సహకారాలను అందించడం వలన మీ వ్యక్తిగత ప్రయోజనాలు మరుగున పడతాయి. మీ పై పెత్తనం చెలాయించాలనుకున్న వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి.
మకరం – ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా స్వల్ప ధన లాభం పొందుతారు. విచిత్రమైన మనస్తత్వం కలిగిన వారితో ముఖాముఖి చర్చలు జరపవలసి రావడం ఇబ్బందిగా పరిణమిస్తుంది.
కుంభం – నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మీకు చేసిన చిన్నపాటి సహాయం కూడా భూతద్దంలో చూపేవారు మీ సమీపంలో ఉంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి.
మీనం – ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. రావాల్సిన ధనాన్ని ఇవ్వవలసిన వాళ్ళు సమయానికి అందుబాటులో ఉండరు. వృత్తి వ్యాపారాలలో కొంత మార్పులు ఉంటాయి.