మేషం – దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నటువంటి బాల్యమిత్రులతోటి తిరిగి పరిచయం ఏర్పడుతుంది.
వృషభం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మాటల వరకే మీ కోపాన్ని పరిమితం చేసి లాభపడగలుగుతారు. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
మిథునం – విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసిక వేదనకు ఏమాత్రం తావివ్వరు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం – సన్నిహితులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.ఉన్నత అధికారుల మెప్పును పొందగలుగుతారు.
సింహం – కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు ప్రవర్తించలేక పోతారు. అత్యంత ఆప్తులని మీరు భావించిన వారితో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి.
కన్య – కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు. మీ శక్తి సామర్థ్యాలు మీ కన్నా ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడతాయి. మీ ఆలోచనలను ఒక దారికి తీసుకువస్తారు.
తుల – ఖర్చు అధికంగా ఉన్న సంతానపరమైన పురోభివృద్ధి బాగుంటుంది. మిత్రుల వలన మేలు జరుగుతుంది. గుడ్ విల్ను మరింతగా పెంపొందించుకుంటారు.
వృశ్చికం – ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల వలన మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది.
ధనుస్సు – వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఆత్మీయులతో ఏర్పడిన అంతర్గత విభేదాలు తలనొప్పిగా పరిణమిస్తాయి. ఆర్థిక లావాదేవీలు కొంత ఊరట కలిగిస్తాయి.
మకరం – సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.ఆర్థికంగా ఉన్నతిని సాధించడానికి గొప్ప కృషి చేస్తారు. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటారు.
కుంభం – దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. అతి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరకు పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక మానసిక ఆనందానికి కారణం అవుతుంది.
మీనం – ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. కార్యక్రమాలను సకాలంలో అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.